ఏపీ హైకోర్టులో ఫస్ట్ డే : 42 కేసుల విచారణ 

  • Publish Date - January 2, 2019 / 09:11 AM IST

విజయవాడ : ఏపీలో హైకోర్టు బిజి బిజీగా వుంది. తొలిరోజునే కీలక కేసులపై విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న   హైకోర్టు విడిపోయిన తరువాత విజయవాడ కేంద్రంగా ఏపీ హైకోర్టు వ్యవహారాలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. నగరంలోని గవర్నర్‌ పేటలో కోర్టు వ్యవహారాల కోసం తాత్కాలిక భవనం కేటాయించడంతో ఉదయం నుంచి జడ్జీలు, లాయర్లు, కేసు విచారణ కోసంవచ్చినవారితో పిటీషన్ దారులతో కోర్టు ప్రాంతం రద్దీగా మారింది. 

హైకోర్టు జడ్జిగా నియమితులైన చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ సహా మిగిలిన న్యాయమూర్తులు ఉదయం 10 గంటలకే విధులకు హాజరయ్యారు. తొలిరోజు మొత్తం 42 కేసుల విచారణ జరగనున్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ వేసిన రిట్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్‌ తొలికేసుగా విచారించనున్నారు.