ఆ డిజైన్ బట్టలనుకుని కొండచిలువను కూడా ఉతికేసిన మహిళ..ఆ తరువాత ఏమైందంటే…

  • Publish Date - August 11, 2020 / 11:57 AM IST

రకరకాల డిజైన్లలో వచ్చే బట్టలు గందరగోళనాకి గురిచేస్తున్నాయి. కొన్నింటిని చూస్తుంటే కాస్త భయం కూడా కలుగుతుంది. చిరుతలు..పైథాన్ లు..సింహాలు..ఇలా షర్టులపై రకరకాల డిజైన్లతో వచ్చే బట్టలు నేడు ఫ్యాషన్. బెడ్ షీట్స్ కూడా అటువంటి డిజైన్లతో వస్తున్నాయి. అటువంటి డిజైన్ బట్టలనుకుని ఎమిలీ అనే మహిళ ఏకంగా ఓ పేద్ద పైథాన్ ని వాషింగ్ మిషన్ లో వేసి ఉతిరిపారేసింది. పాపం తాను వేసింది పైథాన్ డిజైన్ లో ఉండే బట్టల్ని కాదు నిజమైన పైథాన్ న్నే అని ఆమెకు తెలీయకపోవటం మరో విశేషం. అలా ఆమె వాషింగ్ మిషన్ లో వేసిన పైథాన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే..



ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..ఈ ఇల్లాలి చేతిలో..వాషింగ్ మిషన్ లో పడ్డాను..ఉతికి ఉతికి పారేస్తోందిగా ఈ మిషన్ అనుకుంటూ పాపం ఆ పైథాన్ మిషన్ లోనే గిరగిరా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో చోటుచేసుకుంది. ఎమిలీ అనే మహిళ రోజూ మాదిరిగానే దుస్తులు ఉతకడానికి బట్టలన్నింటినీ ఓ కుప్పగా పోసింది.తరువాత ఉతకాల్సిన బట్టల్ని చకచకా వాషింగ్ మెషీన్‌లో వేస్తోంది. అప్పటికే ఆ బట్టల్లో నిద్రపోతున్న కొండ చిలువను దుప్పటి డిజైన్ అనుకుని దాన్ని కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసింది. సర్ఫు, సువాసనలు వెదఝల్లే పౌడర్ కూడా వేసి..స్విచ్ ఆన్ చేసి..టైమ్ సెట్ చేసి స్టార్ట్స్ చేసి ఆ తరువాత ఆమె వేరే పన్లు చేసుకోవటానికి వెళ్లిపోయింది.

తరువాత తాను మెషిన్ కు పెట్టిన టైమ్ అయిపోవటంతో బట్టలు ఉతకడం అయిపోయిందని మిషన్ సిగ్నల్ ఇవ్వగానే.. అందులోంచి బట్టల్ని తీసి ఎండలో వేద్దామనుకుని బయటకు తీస్తుంటే.. ఆమె చేతికి మెత్తగా ఏదో తగిలింది. ఏంటాని తీసి చూసింది అంతే…ఎగిరి గంతేసింది. గుండె ఆగిపోయినంతపని అయ్యింది. చేతిలో ఉన్న కొండ చిలువను మళ్లీ వాషింగ్‌ మెషీన్‌లో పారేసి బయటకు పరుగెత్తి అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ సిబ్బందిని పిలిచింది.
అప్పటికే అది మిషన్‌లో గిరగిరా తిరగడంతో దాని ప్రాణాలు గాబరాగా ఉండటంతో కదలకుండా అలాగే పడి ఉంది. వెంటనే వచ్చిన సెక్యూరిటీ ఆ కొండ చిలువను పట్టుకుని బైటకు తీసి బంధించి..అటవీ ప్రాంతంలో వదిలేశారు.



ఈ ఘటనపై ఎమిలీ మాట్లాడుతూ.. ‘అది బట్టల్లోకి ఎలా దూరిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. తలుపులన్నీ మూసే ఉన్నా అది ఎక్కడ నుంచి వచ్చిందో’నని గుండెలు గుబగుబలాడుతుండగా..వణుకున్న గొంతుతో ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ చెప్పింది. కొద్ది రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ మహిళ టాయిలెట్‌లో కుర్చుంటే.. కొండ చిలువ ఆమె కాలును పట్టుకోవటం..ఏసీలోకి పాములు రావటం..బెడ్ రూమ్ లోకి కూడా పాములు రావటం గురించి విన్నాం..కానీ అటువంటివాటి గురించి తెలుసుకుంటేనే భయంతో గుండెలు హడలిపోతాయి. మరి ఆ పరిస్థితిని ఫేస్ చేస్తే ..ఊహించుకుంటేనే వెన్నులోంచి వణుకు వచ్చేస్తుంది కదూ..