తొందరపడి సోషల్ మీడియా ముందే కూస్తుంది.. శివప్రసాద్ చనిపోలేదు

  • Publish Date - September 20, 2019 / 11:34 AM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్ర పిండాల్లో సమస్య కారణంగా శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన చనిపోయినట్లుగా వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయ‌న‌ మరణించినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవం అని అల్లుడు నరసింహ ప్రసాద్ వెల్లడించారు.

శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో  బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని, అధికారికంగా తాము ప్రకటించే వరకూబ ఎటువంటి వందతులను నమ్మవద్దని ఆయన కోరారు.

2009, 2014లో చిత్తూరు ఎంపీగా ఉన్న ఆయన.. స్వతహాగా నటుడు కూడా. అయితే తొందరపడి ముందే కూసిన అనే మాటకు సరిగ్గా సరిపోయేట్లు.. తొందరపడి సోషల్ మీడియాలో కొందరు ముందే ఆయన చనిపోయినట్లు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు.