బావిలో గుర్తు తెలియని నాలుగు మృతదేహాలు

  • Publish Date - March 22, 2020 / 01:25 AM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వాటిలో ఓ మృతదేహం మహిళది కాగా.. మిగిలిన మూడు మృతదేహాలు పదేళ్లలోపు చిన్నారులవి. మృతదేహాలను గుర్తించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

గుర్తుతెలియని మృతదేహాలను పోలీసులు బావిలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను స్థానికేతరులని పోలీసుల ప్రాథమిక విచారణలో అంచనాకు వచ్చారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తల్లీ పిల్లలుగా పోలీసులు భావిస్తున్నారు.

అయితే చినపోయినవారు అంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఇంకేదైనా కారణం ఉందా? అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలు బాగా ఉబ్బిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.