తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ మీదే తిరుగుబాటు భావుటా ఎగురవేసి వైసీపీకి దగ్గరైన గన్నవర్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవగా.. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. ఆయన టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేయడం.. ఇటు వైసీపీలో చేరకపోవడంతో వంశీ టీడీపీ సభ్యులకు వెనుకవైపు బెంచీలో కూర్చొన్నారు.
అసెంబ్లీకి హాజరైన వంశీ టీడీపీ నుండి గెలిచి, వైసీపీకి ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలకు మద్దుతుగా నిలిచారు. అక్టోబర్ 25న ముఖ్యమంత్రిని కలిసిన తరువాత వంశీ కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. ఇక, చంద్రబాబు విజయవాడలో ఇసుక దీక్ష చేసిన రోజున మీడియా ముందుకు వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. అవసరమైన సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే వంశీ స్పష్టం చేసారు.
వంశీ ఇంకా అసెంబ్లీ రికార్డుల ప్రకారం టీడీపీ సభ్యుడిగానే ఉన్నారు. దీంతో వంశీ గతంలో లాగానే టీడీపీ బెంచ్‌ల్లో వెనుక వైపు కూర్చున్నారు. టీడీపీ తమ పార్టీ నుంబి వంశీని సస్పెండ్ చేసినట్లు అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చిన తరువాత అసెంబ్లీ కార్యదర్శి వంశీకి ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారరు. విప్ ఇచ్చిన సందర్భంలో మాత్రమే పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా సభలో వ్యవహరించాల్సి ఉంటుంది.