‘Goosebumps,’ Lord Parama Shiva devotee Tandav Stotramహర హర మహాదేవ్: భోజ్ పుర్ భక్తుడు పాడిన ‘Goosebumps,’ : శివ తాండవ స్త్రోత్రం
మధ్యప్రదేశ్ లోని భోజ్ పూర్ కు చెందిన ఓ శివభక్తుడు పాడిన ‘శివతాండవ స్త్రోత్రం’ వింటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. మహా శివుడిపై అతనికున్న భక్తి ప్రపత్తులు ఆ స్త్రోత్రంతోనే తెలుస్తోంది. సంస్కృతంలో ఉండే శివతాండవ స్త్రోత్రాన్ని చక్కటి ఉచ్ఛారణతో ఒళ్లుగగ్గుర్పొడిచేలా అతను పరమ శివుడిని స్త్రోత్రిస్తుంటే వినేఎవరికైనాసరే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
మధ్యప్రదేశ్ లోని భోజ్ పూర్ కు చెందిన ఓ శివభక్తుడు కాళీ చరణ్ మహారాజ్. అతను పాడుతున్న స్త్రోత్రానికి సాక్షాత్తు పరమశివుడే దిగి వస్తాడా అన్నట్లుగా ఉంది. అచ్చం రుషిలా కనిపించే ఆహార్యంతో పరమ శివుడిని కాళీచరణ్ మహారాజ్ స్త్రోత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను మూడు వీడియోల ద్వారా తన ట్విట్టర్ లో షేర్ చేశారు ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి. తన స్త్రోత్రంతో అందరినీ మంత్రముగ్థులను చేస్తున్నఈ వీడియోలను చూడండి.
Wow… Received this on WhatsApp…
Apparently, this is Kaalicharan Maharaj from Bhojpur, Madhya Pradesh, a wildly talented devotee of the Mahadev, Lord Shiva.? Namah Shivaya
1 of 3 pic.twitter.com/xbWNAw3oyI
— Amish Tripathi (@authoramish) July 15, 2020