దేశంలో ఉల్లిపాయలను రూ.25 లకే అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ : సీఎం జగన్

  • Publish Date - December 9, 2019 / 07:31 AM IST

ఉల్లి సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. దేశంలో రూ.25 లకే ఉల్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఉల్లి పాయల సమస్యపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకూ 36 వేల 536 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేశామని తెలిపారు. ఏపీలో మాత్రమే కిలో ఉల్లిపాయలు రూ. 25 కు విక్రయిస్తున్నామని తెలిపారు.  

చంద్రబాబు హెరిటేజ్ షాపులో కిలో ఉల్లి రూ.200కు విక్రయిస్తున్నారని చెప్పారు. మహిళల భద్రతపై హోంమంత్రి మాట్లాడుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. మహిళ భద్రతపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా భద్రతపై కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని తెలిపారు.