చెప్పు దాడి వెనక ఆ పార్టీ హస్తం ఉండొచ్చేమో : జీవీఎల్

తనపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియదని..తనను ఉద్దేశించి దాడి చేయలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ వ్యాఖ్యానించారు.

  • Publish Date - April 18, 2019 / 12:48 PM IST

తనపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియదని..తనను ఉద్దేశించి దాడి చేయలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ వ్యాఖ్యానించారు.

తనపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియదని..తనను ఉద్దేశించి దాడి చేయలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ అభియోగం చేయడం లేదని..హిందూ టెర్రర్ అంటూ ప్రజలను మభ్య పెడుతున్న ఓ పార్టీ హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తారని అనుకుంటున్నట్లు..వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని జీవీఎల్ తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి చెప్పుతో జీవీఎల్‌పై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన పార్టీ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

గురువారం సాయంత్రం GVL మరోసారి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ప్రతికా సమావేశంలో తాను మాట్లాడుతున్నప్పుడు ఓ వ్యక్తి చొరబడి చేసిన హడావుడి తనను ఉద్దేశించి చేసింది కాదన్నారు. అతనిపై తీవ్రమైన ఆరోపణలున్నాయని తెలుస్తోందన్నారు. గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను శాఖ వారు ఆయన నడుపుతున్న సంస్థలపై రైడ్స్ చేశారని తెలిపారు. 500 కోట్లు విలువైన చేసే బంగ్లాలను కొన్నాడని గుర్తించిన ఐటీ అధికారులు దాడులు చేశారని చెప్పుకొచ్చారు. 

అయితే..దాడిలో రాజకీయ కారణాలున్నాయా ? పోలీసుల దర్యాప్తులో తేలుతుందన్నారు. తనతో పాటు సీనియర్ నాయకుడు కూడా ఉన్నారని..హిందూ టెర్రర్ అనే అంశంపై తాను మాట్లాడినట్లు చెప్పారు. సాధ్వి ప్రగ్వాను భోపాల్ నుండి ఎన్నికల బరిలో పార్టీ నిలిపిందని..ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచారని వెల్లడించారు. భారతీయ ఆచారం..హిందూ జాతిని అవమానపరిచే విధంగా..ఉగ్రవాద సంస్థలను..పాకిస్తాన్ దాడుల నుండి తప్పించే ప్రయత్నం చేయడం..హిందూ టెర్రర్ పేరిట భారతదేశాన్ని అవమానపరచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హిందూ టెర్రర్ అంటూ ప్రజల ముందు దోషిగా నిలబడిందో ఆ పార్టీ హస్తం ఉందా ? అనేది త్వరలోనే తేలుతుందన్నారు జీవీఎల్. 
Also Read : తేడావస్తే తాటతీస్తాడు : వర్మ బయోపిక్ టైగర్ కేసీఆర్