ప్రత్యేక హోదా అనేది అంతరించిన వ్యవస్ధ: జీవీఎల్ 

మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ  మేనిఫెస్టోలో  హామీలు గుప్పిస్తుంటే...

  • Publish Date - April 8, 2019 / 10:21 AM IST

మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ  మేనిఫెస్టోలో  హామీలు గుప్పిస్తుంటే…

ఒంగోలు: మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ  మేనిఫెస్టోలో  హామీలు గుప్పిస్తుంటే… ఏపీకి ప్రత్యేక హోదా అనేది అంతరించిన వ్యవస్థ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు సంచలన  వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా వ్యవస్థను మార్చి.. ప్రత్యేక లోటు వ్యవస్థను ఆర్థిక సంఘం తీసుకొచ్చిందని ఆయన  సోమవారం ఒంగోలులో తెలిపారు. బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆయన స్పృష్టం చేశారు.

టీడీపీ నేతలే ఐటీ దాడులు చేయించుకుని డ్రామాలాడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. లోటు బడ్జెట్‌ ఉన్న ఏపీకి  కేంద్ర ప్రభుత్వం రూ.22,130 కోట్లు ఇచ్చిందని ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం రూ. 17,500 కోట్లు ఇచ్చినట్లు జీవీఎల్‌  తెలిపారు.
Read Also : ప్రధాని కార్యాలయంలోనే ఉండగానే భారీ అగ్నిప్రమాదం