తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేసేందుకు చంద్రబాబు తమ్ముడి కొడుకు, సినిమా హీరో నారా రోహిత్ సిద్ధమయ్యారు. ఇవాళ(3 ఏప్రిల్ 2019) నుంచి ప్రచారం నిర్వహించనున్నట్లు రోహిత్ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు రోహిత్ ప్రచారం చేయనున్నారు.
నారా రోహిత్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్:
ఏప్రిల్ 3న రాజమహేంద్రవరం ,కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో…
ఏప్రిల్ 4 తణుకు, గురజాల, సత్తెనపల్లి, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు.
అలాగే ఏప్రిల్ 5న రేపల్లె, తెనాలి, పత్తిపాడు నియోజకవర్గాల్లో..
ఏప్రిల్ 6న చిలకలూరిపేట, పర్చూరు, చీరాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఏప్రిల్ 7న ఉరవకొండ, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలలో..
ఏప్రిల్ 8, 9న చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం నారా రోహిత్ పర్యటించనున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి హీరో తారకరత్న ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. వెంకటేష్ మేనమామ అశోక్ కుమార్ ఏపీలో తెలుగుదేశం తరుపున ప్రచారం చేస్తున్నారు. కాగా నారా రోహిత్ ఎంట్రీతో తెలుగు తమ్ముళ్లలో జోష్ వచ్చినట్లు చెబుతున్నారు.