రాజధాని అమరావతి నుంచి విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులను కర్నూలుకు తరలించటంపై వేసిన పిటిషన్లను విచారించింది హైకోర్టు. విశాఖలో మిలీనియం భవనానికి రూ.19 కోట్లు కేటాయిస్తూ.. ఇచ్చిన జీవోలు, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు కొనసాగింపుపై వేసిన పిటిషన్లతో సహా దీనీని విచారించింది కోర్టు.
కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించటంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరపగా.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
రాజకీయంగా లబ్ది కోసమే కార్యాలయాలను తరలిస్తున్నట్లు ఈ సంధర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే స్థలాభావం వల్లే మారుస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.