హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. నేరేడుచర్ల మండలం ఓట్లను మొదటగా లెక్కించారు. ఇక్కడ కారు జోరు చూపిస్తోంది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెంచుకుంటోంది. ఇప్పటివరకు 8 రౌండ్ల ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 17 వేల 400 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. టీడీపీ, బీజేపీ కనీస ఓట్లను సాధించలేకపోయాయి.
> తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ 5583, కాంగ్రెస్ 3107, బీజేపీ 128, టీడీపీ 113. 2476 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది టీఆర్ఎస్.
> రెండో రౌండ్‌లో టీఆర్ఎస్ 4723, కాంగ్రెస్ 2851, బీజేపీ 170, టీడీపీ 69. 4348 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది టీఆర్ఎస్.
> మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ 5089, కాంగ్రెస్ 2540, బీజేపీ 114, టీడీపీ 86. 2549ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది టీఆర్ఎస్.
> నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ 5144, కాంగ్రెస్ 3961, బీజేపీ 102, టీడీపీ 127. 1183 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది టీఆర్ఎస్.
> ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ 25,580 కాంగ్రెస్ 15,491, బీజేపీ 619, టీడీపీ 452. 10, 089 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది టీఆర్ఎస్.
> ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ 5583, కాంగ్రెస్ 3107, బీజేపీ 128, టీడీపీ 113. 2476 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది టీఆర్ఎస్.
14 టేబుళ్లపై అధికారులు ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా…ప్రతి రౌండ్‌లో 8 నుంచి 10వేల ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అకాశముంది.
హుజూర్ నగర్ నుంచి టీఆర్‌ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతితోపాటు మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ చేశారు.