హుజూర్ నగర్ పోలింగ్ : ప్రశాంతం

  • Publish Date - October 21, 2019 / 06:00 AM IST

హుజూర్ నగర్ శాసన సభ స్దానానికి జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని,  ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జాయింట్ సీఈవో తిరుమల రవికిరణ్ చెప్పారు. హుజూర్ నగర్ ఎన్నికల పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు.

302 పోలింగ్ బూత్ లను వెబ్ కాస్టింగ్ ద్వారా లైవ్ లో చూస్తున్నామని, మాక్ పోలింగులో ఒకటి రెండుచోట్ల  ఈవీఎం లు మొరాయించగా వాటిని రీప్లేస్ చేసామన్నారు. పోలింగ్ కు సంబంధించి మీడియాలో వస్తున్న బ్రేకింగ్ లపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని రవికిరణ్ తెలిపారు.