ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

  • Publish Date - September 16, 2019 / 12:39 PM IST

ఏపిలో ఐఏఎస్  అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ప్రిన్సిపల్ సెక్రటరీ(పోలిటికల్) గా ఉన్న ఆర్ పి సిసోడియాను గిరిజ‌న సంక్షేమ శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా  బదిలీ చేశారు.

ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను సియం ప్రిన్సిపల్ సెక్రటరీగా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేశారు.  విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసరుగా ఉన్నడాక్టర్.వి. వినోద్ కుమార్ ను  విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ గా బదిలీ చేశారు. 

ప్రిన్సిపల్  చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా ఉన్న ఇలీయాస్ రిజ్వీని  మైనార్టీ సంక్షేమ శాఖ ముక్య కార్య‌ద‌ర్శిగా బదిలీ చేశారు. ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న ప్రదీప్ కుమార్ కు పూర్తి స్థాయి  ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా  బాధ్యతలు అప్పచెప్పారు.