గజ్వేల్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాలీ

  • Publish Date - February 19, 2019 / 06:40 AM IST

ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని సంగాపూర్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నియామక ర్యాలీ నిర్వహిస్తుట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 27వ తేదీ సాయంత్రంలోగా అక్కడకు చేరుకోవాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే ఫోన్.నం. 9000541112లో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

* విద్యా అర్హత:
– ఉద్యోగ నియామక ర్యాలీలో ఇంటర్ విద్యా అర్హత కలిగి ఉండి ఇంగ్లిషులో 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. 
* వయసు పరిమిథి:
– జనవరి 1999 నుంచి జనవరి 2003 సంవత్సరాల మధ్య పుట్టిన అభ్యర్థులు  ర్యాలీలో పాల్గొనవచ్చని తెలిపారు. 
– నియామక ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్ మిడియట్ ఒరిజినల్ సర్టిఫికెట్ లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు 7, NCC సర్టిఫికెట్‌లతో పరీక్ష రాయడానికి కావాల్సిన వస్తువులు తీసుకురావాలన్నారు. ఫిజికల్ టెస్టు నిర్వహించి ఆంగ్ల మాధ్యమంలో రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.