దేశభక్తి : 100 మి.గ్రాముల బంగారంలో అభినందన్ చిత్రం

  • Publish Date - March 7, 2019 / 02:13 PM IST

పాకిస్తాన్‌ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. కొందరు అభినందన్‌ హెయిర్‌ స్టైల్‌ ఫాలో అవుతుంటే… మరికొందరు చీరలు తయారు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం సింగారావుపేట గ్రామానికి చెందిన ఇల్లెందుల నాగేందర్‌ కూడా తన కళానైపుణ్యంతో అభిమానాన్ని చాటుకున్నాడు.

కేవలం 100 మిల్లీ గ్రాముల బంగారంతో అభినందన్‌ చిత్ర పటాన్ని తయారు చేసి అందులో జైవాన్‌ అని లిఖించి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఇదొక్కటే కాదు బంగారంతో సూక్ష వస్తువులు తయారు చేయడంలో నాగేందర్‌ దిట్ట. బతుకమ్మ, ఈగ, వరల్డ్‌ కప్‌, దర్గా మసీదు, భారతదేశపటం, బాహుబలి ఖడ్గం లాంటివన్నీ సూక్ష్మ రూపంలో తయారు చేశాడు. గత 19 ఏళ్లుగా తాను ఈ వృత్తిలోనే ఉన్నానని గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని నాగేందర్‌ చెబుతున్నాడు.