×
Ad

కడప వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో లుకలుకలు

  • Publish Date - January 28, 2019 / 07:40 AM IST

కడప : జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల జంప్‌లు కావడం..విబేధాలు పొడచూపడం వంటివి అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆకేపాటి ప్రయత్నిస్తున్నారు. మండలాల వారీగా కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు…నేతలను రాయబారానికి పంపారు ఆకేపాటి.

 

మరోవైపు జమ్మలమడుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అల్లె ప్రభావతి ప్రకటించారు. ఇప్పటికే తన అనుచరవర్గంతో భేటీ అయిన అల్లె ప్రభావతి….వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై చర్చించారు. అల్లె ప్రభావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబెల్‌గా పోటీ చేస్తే…వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి.