ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఓ క్రేజ్.. ప్రపంచంలోని ధనిక లీగ్‌లన్నింటిలో టాప్ పొజిషన్‌లో ఉంటుంది. విదేశీ టాప్ ప్లేయర్లతో జరిగే ఈ లీగ్‌కు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటిలోనూ క్రేజ్ ఎక్కువ. బ్యాట్స్‌మెన్ బౌండరీలు, బౌలర్ల వికెట్ల మాయాజాలం అంతా ఒక పండగలా వాతావరణం కనిపిస్తుంది.
అలాంటి ఐపీఎల్‌లో దూకుడైన బ్యాట్స్‌మెన్ ఎవరు.. బాగా సిక్సుల బాదింది ఎవరనే సందేహం ఎవరికైనా ఉంటుంది. అత్యధిక స్కోరు బాదిన ప్లేయర్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
Read Also : ఓ పాక్.. భారత్ మాకు చెప్పే చేసింది: ఐసీసీ
ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ ఎవరంటే..
రాబిన్ ఊతప్ప: 5
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఆడిన రాబిన్ ఊతప్ప.. 4086 పరుగులతో టాప్ 5గా నిలిచాడు. ఐపీఎల్‌తో పాటు కర్ణాటక దేశీవాలీ లీగ్‌లోనూ మెరిసే రాబిన్ ఊతప్ప టీమిండియాలో చోటు కోసం కష్టపడుతూనే ఉన్నాడు.
గౌతం గంభీర్: 4
టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మాజీ కెప్టెన్ గంభీర్.. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి 154 మ్యాచ్‌లలో 4217 పరుగులతో టాప్ 4లో నిలిచాడు.
రోహిత్ శర్మ: 3
హిట్ మాన్ రోహిత్ ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకే ఆడుతూ.. 173 మ్యాచ్‌లలో 4493 పరుగులతో టాప్ 3లో నిలిచాడు.
విరాట్ కోహ్లీ: 2
ఐపీఎల్ మొదలైన నాటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోనే కొనసాగుతోన్న కోహ్లీ 163 మ్యాచ్‌లు ఆడి 4948 పరుగులతో టాప్ 2లో నిలిచాడు.
సురేశ్ రైనా: 1
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతోన్న రైనా ఐపీఎల్ మొదలైన నాటి నుంచి 176 మ్యాచ్‌లు ఆడాడు. 4985 అత్యధిక పరుగులు చేసి టాప్ స్థానంలో నిలిచాడు.