కోస్తాంధ్రలో జగన్ ప్రచారం 

  • Publish Date - March 19, 2019 / 03:07 AM IST

అమరావతి : వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన  పార్టీ అధ్యక్షుడు  జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు.  గడచిన రెండు రోజులుగా పలు జిల్లాల్లో పర్యటనలు జరుపుతున్న ఆయన మంగళవారం  మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.  ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెం, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని వేమూరులో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్  పాల్గోంటారు.