పూర్తి కాని పనులు : జగన్ గృహ ప్రవేశం వాయిదా

అమరావతిలో ఫిభ్రవరి 14న జరగాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా పడే అవకాశముంది.

  • Publish Date - February 12, 2019 / 12:23 PM IST

అమరావతిలో ఫిభ్రవరి 14న జరగాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా పడే అవకాశముంది.

గుంటూరు : అమరావతిలో ఫిభ్రవరి 14న జరగాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ గృహ ప్రవేశం వాయిదా పడే అవకాశముంది. ఇంటి నిర్మాణ పనులు పూర్తి కానందున గృహ ప్రవేశం వాయిదా వేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి పనులు పూర్తైన తర్వాతే గృహ ప్రవేశం చేస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నారు.

ఫిభ్రవరి 11 సోమవారం జగన్ సతీమణి వైఎస్ భారతి అమరావతిలో ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంటి పనులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గృహ ప్రవేశాన్ని వాయిదా వేయాలని భావించినట్లు సమాచారం. దీంతో గృహప్రవేశానికి సంబంధించిన పనులను నిలిపివేశారు. అయితే ఇప్పటికే జగన్ కుటుంబ సభ్యులు పార్టీ నేతలకు గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలు పంపారు. ఎల్లుండి గృహప్రవేశంపై సందిగ్థత నెలకొంది. 
 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం