జగన్ విజయయాత్ర : నన్ను నడిపించింది ప్రజలే

  • Publish Date - January 9, 2019 / 10:47 AM IST

శ్రీకాకుళం : ‘తనను నడిపించింది ప్రజలే…పై నున్న దేవుడు..నాన్న ఆశీర్వచనాలే’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వెల్లడించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టాండులో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. అంతకుముందు విజయస్థూపాన్ని ఆవిష్కరించి బహిరంగసభకు స్థలికి నడుచుకుంటూ వచ్చారు. 
సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఎక్కడ చూసినా జనాలు కనిపించారు. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారంటూ..కనుచూపు మేరలో కూడా జనాలు కనిపిస్తున్నారని..తన పాదయాత్ర సక్సెస్ చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు జగన్ తెలిపారు.