2004లో నాన్నకిచ్చారు.. ఇప్పుడు నాకు ఇవ్వండి: జగన్

2004 లో దివంగత నేత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే..

  • Publish Date - April 4, 2019 / 07:34 AM IST

2004 లో దివంగత నేత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే..

2004 లో దివంగత నేత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే.. నాన్నగారిలా రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన జగన్.. చనిపోయిన తర్వాత తన తండ్రి ఫోటోతో పాటు తన ఫోటో కూడా పెట్టుకునేలా పరిపాలన అందిస్తానని జగన్ చెప్పారు. పదేళ్ల పాటు తనని చూశారని, ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మార్చి చూపిస్తానని అన్నారు.

అలాగే చంద్రబాబు అవినీతి పెరిగిపోయిందని, ఇక ఎన్నికల నాటికి కుట్రలు చేయడం పెంచుతారని జగన్ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఏడాదికి పిల్లలను బడికి పంపిస్తే.. 15వేలు ఇస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తీసుకోవాలని, వాటి మీద రుణాలను ఎత్తేస్తాం అని జగన్ చెప్పారు.

ఐదేళ్లలో రుణ మాఫీలు, సున్నా వడ్డీ రుణాలు తీసేసి ఇప్పడు చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నాడని, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోకండి అని జగన్ సూచించారు. పెన్షన్ రూ.3వేలకు పెంచుకుంటూ పోతాడు మీ మనవడు అని ప్రతీ ముసలవ్వకు చెప్పాలని జగన్ అన్నారు.
Read Also : ప్రపంచం మెచ్చింది : నా కోడిపిల్లను కాపాడండీ.. పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు