ఓటు వేసిన పవన్ : సమయం పెంచండి

  • Publish Date - April 11, 2019 / 04:20 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. ఏప్రిల్ 11 గురువారం విజయవాడలోని పటమటలో ఉన్న చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో  ఆయన ఓటు వేసి తొందరగా వెళ్లిపోయారు.

ప్రశాంతంగా ఓటింగ్ జరగాలన్నారు పవన్. 200 ఈవీఎంలు పనిచేయడం లేదని తమకు సమాచారం వచ్చిందన్నారు. గాజువాక నియోజకవర్గంలో కూడా పలు సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైనందున పోలింగ్ సమయాన్ని పెంచాలని ఆయన ఎన్నికల కమిషన్‌ను కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఆయుధమని, ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.