తాను ప్రచారం చేస్తుంటే స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారా ? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారు ? దద్దమ్మల్లారా..మూర్ఖుల్లారా ? అంటూ మండిపడ్డారు. లైట్లు ఆపివేస్తే ఏం గుండెల్లో ఉన్న వెలుగు ఆపగలరా ? అంటూ ప్రశ్నించారు. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం పెందుర్తిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో స్ట్రీట్ లైట్లు ఆపివేశారనే సమాచారం వచ్చింది. ఎందుకు ఆపివేస్తారు ? మంచి పద్ధతి కాదన్నారు.
పెందుర్తికి డిగ్రీ కాలేజీ రావాలని..ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండాలన్నారు. వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులో వైద్యులు ఉండాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకులు అడ్డగోలుగా దోచుకుంటుంటే ఆవేదన రాదా ? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయిందంటే కారణం స్థానిక ఎమ్మెల్యే కారణమన్నారు. రైతులు భూములు లాక్కొన్నారని తెలుసుకుని వారి దగ్గరకు వెళ్లడం జరిగిందన్నారు.
తాము భూములు ఇవ్వలేదు..బలవంతంగా భూములు తీసుకున్నారని అక్కడి వారు చెప్పడం జరిగిందని గుర్తు చేశారు పవన్. తెలుగుదేశం జన్మభూమి కమిటీలు కాదని..గూండా కమిటీలు ఆనాడే చెప్పానన్నారు. జన్మభూమి కమిటీలు పేరు చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కొన్నారన్నారు. టీడీపీనీ చీల్చి చెండాడిది ఒక్క జనసేన పార్టీయేనని..జగన్ అసెంబ్లీకి వెళ్లి సమస్యలను ప్రస్తావిస్తే తాను బయటకు వచ్చే వ్యక్తిని కాదన్నారు పవన్