జేసీ బరస్ట్ : తిండిలేనోడు కూడా ఓటుకి 5వేలు అడిగాడు.. ఎన్నికల ఖర్చు రూ.10వేల కోట్లు

  • Publish Date - April 22, 2019 / 07:49 AM IST

ఏపీ ఎన్నికల ఖర్చు ఎంత అంటే.. వేల కోట్లుగా చెబుతుంటారు.. వాస్తవంగా అయితే 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సంచలన కామెంట్లు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి.. 10 వేల కోట్లు పంచాయని.. ప్రతి ఒక్కరూ డబ్బులు అడిగినోళ్లే అంటూ బరస్ట్ అయ్యారు. ఇదంతా అవినీతి సొమ్మే అంటూ మరో బాంబ్ పేల్చారాయన. ఇంత అవినీతి జరుగుతుంటే చూస్తూ కూర్చొవాలా అని కూడా ప్రశ్నించారాయన. ఎవరో ఒకరు నడుం బిగించాలని.. ఎన్నికల ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు జేసీ. ఏప్రిల్ 22వ తేదీ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జేసీ.
Also Read : చిచ్చు పెట్టిన కుక్క : మహిళలను చితక్కొట్టిన కాంగ్రెస్ లీడర్

నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో రూ. 7 లక్షలు, రెండోసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు రూ. 25 లక్షలు.. ఇలా ఎన్నికల ఖర్చు పెరుగుతూ పోతూ వస్తోందన్నారు. ప్రస్తుతం రూ.25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కుండబద్ధలు కొట్టారు. తన నియోజకవర్గంలో రూ. 50 కోట్లు ఖర్చు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడు మాసాల కిందటే చంద్రబాబు పలు పథకాలను ప్రవేశ పెట్టారని.. ఇది ఆలస్యమయితే మాత్రం టీడీపీది అథోగతి అయ్యేదన్నారు జేసీ. రాయలసీమలో తినడానికి తిండి లేని వారు రూ. 5వేలు డిమాండ్ చేశారన్నారు. ఎన్నికల్లో సంస్కరణలు చేయాల్సి ఉందన్నారు. 

జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుటుంబానికి మాత్రం టికెట్లు దక్కాయి. జేసీ అశ్మిత్ రెడ్డికి తాడిపత్రి అసెంబ్లీ నియోజకర్గం, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ రెడ్డి రంగంలోకి దిగారు. వారసుల పోటీతో ఆయన ఈసారి బరిలోకి దిగలేదు. మరి జేసీ వ్యాఖ్యలపై మిగతా పార్టీలు ఘాటుగా స్పందించాయి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టానని జేసీ స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి.. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
Also Read : బరిలో షీలా దీక్షిత్ : ఢిల్లీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్