జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ

  • Publish Date - March 17, 2019 / 06:14 AM IST

విజయవాడ:  సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ  ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు.  పార్టీ అధ్యక్షుడు పవన్  కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.  సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో పార్టీని స్ధాపించి, ఆదిశగా ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని లక్ష్మీ నారాయణ ఈ సందర్భంగా చెప్పారు. 2014 లోనే కలిసి పని చేయాలనుకున్నాం కానీ  అది ఈ నాటికి సాధ్యపడిందని ఆయన చెప్పారు. నా ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఒకేలా ఉంటాయి.  యువతరం బాగుండాలి , మహిళలకు సాధికారికత కల్పించాలి, అన్నివర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక.దాని కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు.  అని లక్ష్మీ నారాయణ అన్నారు. 

భారత దేశమంతా యువతరం తో నిండిపోయింది.  ఈయువతరాన్ని వచ్చే 5  సంవత్సరాలలో  మంచి మార్గదర్శనంలో  నడిపి ,వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచగలిగితే  భారత దేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారటానికి అవకాశం ఉంటుందని లక్ష్మీ నారాయణ అన్నారు.  జనసేన ప్రకటించిన మేనిపెస్టో  ఇంత వరకూ ఎవరూ ప్రకటించలేదని, ప్రపంచ దేశాలు ఇలాంటి మేనిఫెస్టో గురించి చర్చించుకుంటున్నాయి. అని లక్ష్మి నారాయణ చెప్పారు.  1 ప్లస్  1 కలిపితే  2 అంటారు అందరూ,  కానీ నేను 1+1  కలిపితే 11 అంటాను. ఆ విధంగా అందరం పవన్ కళ్యాణ్ గారికి మద్దితిచ్చి కొత్త సమాజాన్ని స్దాపిద్దామని పేర్కోన్నారు.  డబ్బుల్లేకుండా రాజకీయం లేదన్న సమాజంలో  జీరో బడ్జెట్  పాలిటిక్స్ కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందిస్తున్నాను అని లక్ష్మీనారాయణ  అన్నారు.

ట్రెండింగ్ వార్తలు