కొత్త ఒరవడి : హామీలను బాండ్ పేపర్ రాసిచ్చిన జేడీ 

విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

  • Publish Date - April 6, 2019 / 09:10 AM IST

విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. విశాఖపట్టణం మేనిఫెస్టో‌ను బాండ్ పేపర్ మీద రాసిస్తానని ప్రకటించిన జేడీ.. అనుకున్నట్లుగానే చేశారు. ఏప్రిల్ 06వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నికల మేనిఫెస్టో బాండ్ పేపర్‌ను జేడీ రిలీజ్ చేశారు. రూ. 100 బాండ్ పేపర్‌పై హామీలను పొందుపరచ్చారు. 
Read Also : వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

విశాఖలోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తానని అందులో పొందుపరిచారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట‌లో తనవంతు కృషి చేస్తానని, విశాఖ సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఇచ్చిన హామీలను..సమస్యల పరిష్కారానికి చేసిన పురోగతిపై నివేదిక..’Reach your MP’ పేరిట యాప్‌ని రిలీజ్ చేసి ప్రజల ముందుంచుతానని తెలిపారు. 

ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు. కాలుష్య నియంత్రణ కోసం 5 ఏళ్లలో విద్యార్థుల భాగస్వామ్యంతో రెండు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం. విశాఖలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన జేడీ.. మరికొన్ని హామీలను అందులో పొందుపరిచారు. ఇచ్చిన హామీలు అమలు చేయ్యకపోతే కోర్టుకు కూడా లాగొచ్చని జేడీ తెలిపారు. మరి ఈయన ఇచ్చిన బాండ్ పేపర్‌కు ఓటర్లు ఆకర్షితులవుతారా ? లేదా ? అనేది చూడాలి. 
Read Also : వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే