వేడికి ఉపశమనం : ఉల్లిగడ్డలను పంచిన జోగు రామన్న

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనితో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ప్రచారంతో వాతావరణం సైతం హీట్ ఎక్కుతోంది.

  • Publish Date - March 29, 2019 / 04:59 AM IST

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనితో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ప్రచారంతో వాతావరణం సైతం హీట్ ఎక్కుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనితో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ప్రచారంతో వాతావరణం సైతం హీట్ ఎక్కుతోంది. ప్రధాన పార్టీల నేతలు ప్రచార పర్వంలో దూసుకపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండలు ఎక్కువవుతుండడంతో ఉదయం నుండే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఇక వారికి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ఎండలకు తాళలేకపోతున్నారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని…కొబ్బరి బొండాలు, శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు.
Read Also : ఎన్నికల బరిలో డాక్టర్లు : ఓటర్ల ‘నాడి’పట్టేందుకు పోటీ

ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు అధికంగా ఉంటున్నాయి. ప్రచారం నిర్వహిస్తున్న TRS నేతలు చక్కటి ఉపాయాన్ని ఎంచుకున్నారు. ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే జోగు రామన్నలు కార్యకర్తలకు, ప్రచారం నిర్వహించే వారికి ‘ఉల్లిగడ్డలు’ పంచుతున్నారు.

ఎందుకంటే ఇది దగ్గర పెట్టుకుంటే ప్రమాదం ఉండదని..వడదెబ్బ కూడా తగులదని అంటున్నారు. వేడిని తగ్గించేందుకు చక్కటి ఔషధం అని..వీటిని జేబులో ఉంచుకోవాలని వారు సూచిస్తున్నారు. అంతేగాకుండా కార్యకర్తలకు మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. 
Read Also : హైదరాబాద్‌కు మోడీ.. భారీ భద్రత