ఇప్పుడు ఎన్నికలొస్తే.. జగన్‌కు 23సీట్లు కూడా రావు

  • Publish Date - March 2, 2020 / 02:51 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తొమ్మిది నెలల పాలనలోనే ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. దురద్దేశంతోనే మూడు రాజధానుల ప్రకటన జగన్ చేశారని, రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు ఆయన. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్‌కు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లు కూడా రావంటూ జోస్యం చెప్పారు.

అమరావతి రైతులకు సంఘీభావంగా బీజేపీ నేతలతో కలసి తుళ్లూరు దీక్షా శిబిరంలో మాట్లాడిన లక్ష్మీ నారాయణ.. రాష్ట్రంలో జగన్‌ పాలన సాగుతోందో.. పోలీసు పాలన సాగుతోందో అర్థం కావట్లేదని మండిపడ్డారు. రాజధాని పేరుతో తమ భూములు కబ్జా చేస్తారనే భయంతో విశాఖ ప్రజలు హడలి పోతున్నారని అన్నారు.

రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు కన్నా లక్ష్మీ నారాయణ. రాజధాని విషయంలో త్వరలో భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, రావెల కిశోర్‌బాబు, శనక్కాయల అరుణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా గుంటూరు కన్నావారి తోట నుంచి తుళ్లూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.(కర్నూలులో తిరగలేరు… మంత్రికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్)