స్వప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజాన్ని, ప్రజలను మతపరంగా విభజిస్తుందని ఆరోపాంచారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. ప్రజాధనాన్ని ఉపయోగించి మతప్రచారకులకు గౌరవవేతనం చెల్లించడం, వాళ్లను గుర్తించేందుకు గ్రామవాలంటీర్లతో ఈసర్వే చేయించడం చాలాదారుణం అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య లౌకిక దేశంలో ప్రజాధనాన్ని మతపరంగా ఉపయోగించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధుల్లో చేరిన గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం మొదటగా ఇచ్చిన పని ఓ పథకానికి లబ్దిదారులు ఉన్నారో లేదో సర్వే చేయడం. ఈ పథకం ఏమిటంటే “పాస్టర్లకు.. రూ. ఐదు వేలు గౌరవ వేతనం ఇవ్వడం”. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. వాలంటీర్లతో లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే ప్రారంభించేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మత ప్రచారకులకు గౌరవవేతనం చెల్లించడం సరికాదని.. పాస్టర్లను గుర్తించడం కోసం గ్రామవాలంటీర్లతో సర్వే చేయించడం దారుణమని మండిపడ్డారు. ప్రజాధనాన్ని మతపరంగా ఉపయోగించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం స్వప్రయోజనాలే లక్ష్యంగా సమాజాన్ని,ప్రజలను మతపరంగా విభజించి లబ్దిపొందేందుకు ప్రజాధనాన్ని వినియోగించి మతప్రచారకులకు గౌరవవేతనం చెల్లించడం,గ్రామవాలంటీర్లతో ఈసర్వే చేయించడం చాలాదారుణం
ప్రజాస్వామ్య లౌకిక దేశంలో ప్రజాధనాన్ని మతపరంగా ఉపయోగించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. pic.twitter.com/XDfQl1GmDJ
— Kanna Lakshmi Narayana (@klnbjp) September 3, 2019