చంద్రబాబుకు ఓటేస్తే పాకిస్తాన్ ప్రధానికి ఓటేసినట్లే!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Publish Date - April 6, 2019 / 02:21 AM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే పాకిస్తాన్ ప్రధానికి ఓటేసినట్లేనని అన్నారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అందుకే కశ్మీర్‌లోని అరాచక వాది ఫరూక్‌ అబ్దుల్లాతో ప్రచారం చేయించుకున్నారని మండిపడ్డారు.
Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో

తనకు ఎంతో అనుభవం ఉందని, తానైతేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అవినీతి పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని మండిపడ్డారు.

2017లో అసెంబ్లీ సమావేశంలో మోడీ వంటి అవినీతి రహిత ప్రధానిని చూడలేదని చెప్పిన చంద్రబాబు.. రాజకీయ లబ్ధి కోసం నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
Read Also : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం