కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధికి అస్వస్ధత 

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Publish Date - April 9, 2019 / 09:54 AM IST

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరీంనగర్: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీజేపీ నిర్వహించిన  విజయ సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆయన ప్రచారం నిర్వహిస్తుండంగా టవర్ సర్కిల్ దగ్గరకొచ్చేసరికి కళ్లు తిరిగి కింద పడిపోయారు. కార్యకర్తలు వెంటనే ఆయన్ను అంబులెన్స్ లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  వడదెబ్బ కారణంగా ఆయన స్పృహ తప్పికింద పడినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ లోని రీచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను

కాగా.. బండి సంజయ్ గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచి పరాజయం పొందారు. గతంలోనే సంజయ్ కు హార్ట్ స్ట్రోక్ రావటంతో స్టంట్ వేశారు. ఈ పరిస్ధితుల్లో  సంజయ్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.  కరీంనగర్ లోక్ సభ స్ధానానికి బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ నుంచి బి.వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్  పోటీలో ఉన్నారు. 
Read Also : 15 లక్షలు అకౌంట్స్ లో వేస్తామని ఎప్పుడూ చెప్పలేదు

ట్రెండింగ్ వార్తలు