కరీంనగర్ : తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఏకమయ్యారు. అమెరికాలో ప్రేమించుకున్న జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు నడుమ అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. అమెరికా పెండ్లిపిల్ల పేరు హెరాన్ హోరాన్సీ.. తెలంగాణ పెళ్లి కొడుకు పేరు శివచేతన్.. న్యూయార్క్‌లో ఏడాదిన్నరగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో పెళ్లితో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం… వేద మంత్రాల మధ్య అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన శివచేతన్ న్యూయార్క్‌లో కన్‌స్ట్రక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న హెరెన్ హోరాన్సీతో శివచేతన్‌కు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఏడదిన్నరగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు తమ మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పారు. మొదట పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ఆ తర్వాత అంగీకరించారు. ఇంకేముంది అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అంతా భారత్‌కు తరలివచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం తమ కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించారు.
ఖండాలు దాటిన ప్రేమ… వివాహ బంధంతో ఒక్కటైంది. భారత సంప్రదాయాలు గొప్పవని.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని హెరెన్ తెలిపింది.అటు శివచేతన్, హెరెన్ జంటను బంధు మిత్రులంతా ఆశీర్వదించారు.