గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో కలకలం రేపిన బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సేఫ్ గా ఉన్నాడు.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో కలకలం రేపిన బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సేఫ్ గా ఉన్నాడు. 24 గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు శామ్యూల్ నుంచి బాలుడిని పోలీసులు రక్షించారు. తాడేపల్లిలో ఆరేళ్ల బాలుడు పార్థసారధిని దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే శామ్యూల్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బాలుడి కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు. బాలుడు ఎక్కడున్నాడన్న విషయాన్ని 24 గంటల్లోనే చేధించారు. నిందితుడు శామ్యూల్ నుంచి బాలుడిని పోలీసులు రక్షించారు.
తాడేపల్లికి కూతవేటు దూరంలో నివాసముంటున్న శ్రీనివాస్, వెంకటరత్నం దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే ఒకటో తరగతి చదువుతున్న కుమారుడు పార్థసారధిని బుధవారం(డిసెంబర్ 4, 2019) సాయంత్రం తండ్రి శ్రీనివాస్ బయటికి తీసుకెళ్లాడు. అయితే తండ్రికి మద్యం అలవాటు చేసి బాలుడిని కిడ్నాప్ చేయాలని శామ్యూల్, అబ్రహం అనే అన్నదమ్ములు ప్లాన్ వేశారు. వీరు తాపీ పని చేస్తారు. వీరికి రూ.8 లక్షల అప్పు ఉంది. మద్యం సేవించే సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయాలని శ్రీనివాస్ చెప్పాడు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఎలాగైనా బాలుడిని కిడ్నాప్ చేయాలనుకున్నారు.
తండ్రి శ్రీనివాస్ తోపాటు అతని కుటుంబ సభ్యులను బెదిరించి.. డబ్బులు వసూలు చేసి, తన అప్పులు తీర్చుకుందామని ప్లాన్ వేశారు. ప్లాన్ లో భాగంగానే నిన్న సాయంత్రం బాలుడు పార్ధసారధిని కిడ్నాప్ చేశారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో బాలుడి తల్లి వెంకటరత్నానికి ఫోన్ చేసి, రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వని పక్షంలో బాలుడిని చంపేస్తామని బెదిరింపులు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు, మరెవరికైనా చెబితే విషయం చాలా సీరియస్ గా ఉంటుందని హెచ్చరించారు.
ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న శ్రీనివాస్ భార్య వెంకటరత్నం హుటాహుటినా తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు గుంటూరు అర్బన్ ఎస్పీ, ఏడీసీపీని ఇన్ స్పెక్షన్ ఆఫీసర్ గా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పత్తిపాడులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడకు కూడా వెళ్లారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుడిని పట్టుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బాలుడిని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. దీంతో బాలుడి కిడ్నాప్ సుఖమయం అయింది.