జగన్‌పై చంద్రబాబు ట్వీట్.. కేటిఆర్ కౌంటర్!

  • Publish Date - March 28, 2019 / 02:43 AM IST

ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో నేతల మధ్య మాటల హీట్ పెరిగిపోయింది. ప్రచారంలో భాగంగా విమర్శలు దాడి పెంచిన నేతలు.. ట్విట్టర్ వేదికగా కూడా మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విమర్శలకు కేటిఆర్ కౌంటర్ ఇచ్చారు. “కేసీఆర్‌తో కలిస్తే తప్పా, అని జగన్ అడుగుతున్నాడు. ఆంధ్రావాళ్లను ద్రోహులు, ఆంధ్రావాళ్లు దొంగలు అన్నాడు. తెలంగాణలోకి అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతా అన్నాడు అలాంటి వాళ్లతో కలవడం జగన్‌కు మాత్రమే చెల్లు..” అని ట్విట్టర్‌లో చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.. చంద్రబాబుకు చురకలు అంటిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్‌పై విరుచుకుని పడుతున్న మీరు తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో ఎందుకు పొత్తుపెట్టుకోవాలని అనుకున్నారో తనకు అర్థం కావట్లేదంటూ ట్వీట్ చేశారు.