కర్నూలు : సీఐ లైంగికంగా వేధిస్తున్నాడంటూ లేడీ హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్

  • Publish Date - July 17, 2020 / 02:10 PM IST

కర్నూలు సీఐ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ పకీరప్పకు మొరపెట్టుకుంది. తాను ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయటంతో సీఐ నుంచి తనకు ఇద్దరూ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందినవారే కావటంతో ఓఎస్ డీ సదు సీఐపై వచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే..కర్నూలు సీఐ గుణశేఖర్ బాబు తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ హెడ్ కానిస్టేబుల్ ఉష ఎస్పీ ఫకీర్పకు ఫిర్యాదు చేసింది. దీంట్లో భాగంగా తన ఫోన్ లో మెసేజ్ లను ఎస్పీకు చూసించింది ఉష. నేను ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని సీఐ నన్ను బెదిరిస్తున్నాడని వీటిని ఆధారంగా చేసుకుని నాకు న్యాయం చేయాలని దీంతో నాకు నా బిడ్డకు సీఐ గుణశేఖర్ వల్ల ప్రాణహాని ఉందని దయచేసి నాకు న్యాయం చేయాలని వేడుకుంది. తనకు గానీ నా బిడ్డకు గానీ ఏదైనా అపాయం జరిగితే దానికి సీఐ గుణశేఖరే కారణమ మీడియాకు తెలిపింది ఉష.

హెడ్ కానిస్టేబుల్ సీఐపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలుసుకునేందుకు ఎస్పీ విచారణ చేపట్టారు. దీని కోసం ఓఎస్ డీ అంజనేయుల్ని విచారణకు ఆదేశించారు. ఉష చేసిన ఆరోపణలు వాస్తవం అనితేలితే గుణశేఖర్ పై చర్యలు తీసుకుంటామని ఎస్పీఫకీర్ప తెలిపారు.