అయోధ్యలో రామజన్మభూమి వివాదం ముగిసింది. రామమందిరానికి భూమిపూజ కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా శ్రీకృష్ణుడు జన్మభూమి గురించి వివాదం మొదలైంది.రామ జన్మభూమి వివాదం పూర్తి అయ్యిందో లేదో ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కొత్త వివాదం మొదలైంది. శ్రీకృష్ణ జన్మస్థానం అయిన మథురలో శ్రీకృష్ణ ఆలయానికి చెందిన 13.37 ఎకరాల భూమిని తిరిగి పొందాలని భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ ట్రస్టు కోర్టులో సివిల్ పిటీషన్ దాఖలు చేసింది. దీంట్లో భాగంగా శ్రీ కృష్ణ ఆలయ సమీపంలోని ఉన్న షాహీ ఇద్గావ్ మసీదును తొలగించి, మొత్తం 13.7 ఎకరాల భూమిని శ్రీకృష్ణ మందిరానికే అప్పగించాలని మథుర కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ న్యాయవాది రంజనా అగ్నిహోత్రి మరో ఆరుగురితో కలిసి ఈ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
మథురలో బజార్ సిటీ వద్ద ఉన్న శ్రీకృష్ణుడు ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న షాహి ఈద్గాను తొలగించాలని కోరుతూ బాలదేవత భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ ట్రస్ట్ కోర్టుకి వెళ్ళింది. ట్రస్ట్ సభ్యురాలు రంజనా అగ్నిహోత్రి మథుర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సివిల్ దావా వేసిన ఈ దావాలో ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, షాహి ఈద్గా ట్రస్టు మేనేజ్‌మెంట్ కమిటీలను ప్రతివాదులుగా చూపారు. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్.. ఈద్గా ట్రస్టు మేనేజ్‌మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని పిటీషన్‌లో ఆరోపించారు.
శ్రీకృష్ణుడి మందిరానికి చెందిన భూమిని ఆక్రమించి..మసీదు నిర్మించారని పేర్కొంటూ.. ప్రతివాదులుగా సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డును చేర్చారు. శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించాడనీ..ఈ ప్రాంతాన్ని ‘కాట్రా కేశవ్ దేవ్శ’గా పిలుస్తారని ఈ ప్రాంతం వద్ద ఉన్న మొత్తం 13.37 ఎకరాల స్థలంపై యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్, మసీదు ట్రస్ట్ లేదా ఇతర ముస్లిం వర్గాలకు ఎటువంటి హక్కులేవని, మొత్తం భగవాన్ శ్రీకృష్ణ జన్మభూమిదేనని వ్యాజ్యం దాఖలు చేసిన రంజనా అగ్నిహోత్రి అన్నారు.
శ్రీకృష్ణ ఆలయంలోని కొంత భాగాన్ని 1669-70లో నాటి మొగల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసి ఈ షాహీ ఈద్గా మసీదు నిర్మించారు.. ఇది జరిగిన వందేళ్ల తర్వాత యుద్ధంలో మరాఠాలు విజయం సాధించి, మథుర, ఆగ్రాలను స్వాధీనం చేసుకున్నారు.. అనంతరం మసీదును తొలగించి శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరుద్దరించారు’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రతీ అంగుళం భూమి పరమ పవిత్రమైనదనీ..తెలిపారు.
కాగా..‘ఆగ్రా, మథురలను మరాఠాలు నాజుల్ భూమిగా ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా 1803 వరకు దీనిని కొనసాగించింది.. 1815లో మొత్తం 13.37 ఎకరాలను వేలం వేయగా కాశీ రాజు పట్నీమల్ దక్కించుకున్నారు.. 1921లో ఈ భూమి తమకే చెందుతుందని ముస్లింలు వేసిన పిటిషన్‌ను సివిల్ కోర్టు కొట్టివేసింది..
తర్వాత 1944లో కాశీ రాజు వారసులు పండిట్ మదన్ మోహన్ మాలవ్యా, గోస్వామి గణేశ్ దత్, భికేన్ లాల్జీ అటార్నీలకు ఈ భూమిని అమ్మేశారు.. రూ.13,400 మొత్తాన్ని జుగల్ కిశోర్ బిర్లా చెల్లించారు.. ఇక, 1951 మార్చిలో ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి, మొత్తం భూమి దానికే చెందుతుందని పేర్కొన్నారు.. దివ్యమైన మందిర నిర్మించాలని ట్రస్ట్ నిర్ణయించింది’ అని వివరించింది.
‘1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘం, షాహీ మసీదు ఇద్గా మధ్య రాజీ కుదిరింది.. అయినా వాటికి ఈ భూమిపై ఎటువంటి యాజమాన్య హక్కులు లేవు. వారి వ్యాజ్యం ప్రకారం భక్తుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ట్రస్ట్.. మసీదు ఇద్గా డిమాండ్లకు అంగీకరించింది. జూలై 1973లో మథుర సివిల్ జడ్జి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి, ఇప్పటికే ఉన్న నిర్మాణాలను మార్చడాన్ని నిషేధించారు’ అని పేర్కొంది.