బీసీసీఐ రప్పించింది: ఐపీఎల్‌లోకి లసిత్ మలింగ

మాటిచ్చి తప్పిన లంక బోర్డుకు చురకలంటించింది బీసీసీఐ. ఎన్నికలకు అనుగుణంగా ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..

మాటిచ్చి తప్పిన లంక బోర్డుకు చురకలంటించింది బీసీసీఐ. ఎన్నికలకు అనుగుణంగా ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..

మాటిచ్చి తప్పిన లంక బోర్డుకు చురకలంటించింది బీసీసీఐ. ఎన్నికలకు అనుగుణంగా ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 11లోపు జరగనున్న మ్యాచ్‌లలో లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగాల్సి ఉంది. కానీ ఇచ్చిన మాటకు తూచ్ .. చెప్పేసి లంక ఆడుతున్న వన్డే టోర్నీకి సిద్ధం చేస్తుంది. దీంతో ఐపీఎల్ వ్యవహారాలు పర్యవేక్షిస్తోన్న బీసీసీఐ లంక క్రికెట్ బోర్డుపై వాదనకు దిగింది. తీవ్రంగా ఒత్తిడి చేసి తర్వాతి మ్యాచ్‌కి అధికారికంగా లీగ్ కు రావాలని పిలుపునిచ్చింది. 
Read Also : ఐపీఎల్‌లో స్లెడ్జింగా: వాట్సన్‌పై ఇషాంత్ రెచ్చిపోయాడు

వాదనల తర్వాత లసిత్ మలింగను మార్చి 28న జరగబోయే మ్యాచ్ నుంచి ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. ఇందులో విధించిన షరతులు ప్రకారం.. ఏప్రిల్ 11న ముగిసే తొలి దశ షెడ్యూల్ ప్రకారం.. ఇంకా 2 మ్యాచ్ ఉండగానే తమ జట్టు ప్లేయర్‌ను ఐపీఎల్ కు పంపేందుకు లంక క్రికెట్ బోర్డు అనుమతించింది. 

కొద్ది సంవత్సరాల క్రితం ఐపీఎల్‌లో ప్లేయర్‌గా ఆడిన లసిత్ మలింగ్ ఐపీఎల్ 2019 వేలంలో రూ.2కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్,లతో మార్చి 28, మార్చి 30, ఏప్రిల్ 3 మ్యాచ్ లు మాత్రమే  ఆడనుంది. 
Read Also : బీసీసీఐ రప్పించింది: ఐపీఎల్‌లోకి లసిత్ మలింగ