lok sabha election 2019 : TRS జాబితా 21న విడుదల

  • Publish Date - March 19, 2019 / 02:58 PM IST

లోక్ సభ ఎన్నికల్లో TRS పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. టీఆర్ఎస్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తుందో తెలిసిపోయింది. మార్చి 21వ తేదీ గురువారం రిలీజ్ చేస్తున్నట్లు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో TRS నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని గుర్తు చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 16 సీట్లను గెలిపించాలని కోరారు. ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం బాగు చేసుకొనే పరిస్థితి ఉంటుందన్నారు. దేశానికి ఒక మార్గదర్శనం చేద్దామని..ఇందుకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. 21న ప్రకటించే జాబితాలో నిజామాబాద్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని..ఎవరు అభ్యర్థి అయినా గెలిపించాలని ప్రజలను కోరారు కేసీఆర్.