వీడియో: వెహికల్ డోరు తీసి.. ప్రాణాలు తీశాడు

  • Publish Date - April 26, 2019 / 11:28 AM IST

రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కూడా ఎదుటివాళ్లు నిర్లక్షంగా ఉంటే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సరిగ్గా అటుంవంటి సంఘటనే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో జరిగింది. ఓ ఆటో డ్రైవర్ నిర్లక్షానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో టాటా ఏస్ వాహనం డ్రైవర్ చేసిన పొరపాటుకు ఒక వ్యక్తి చనిపోగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

వివరాళ్లోకి వెళ్తే.. సైదులు రెడ్డి అనే వ్యక్తి నీలవేణి అనే మహిళతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. రోడ్డుపై టాటా ఏస్‌ వాహనాన్ని ఆపిన ఆటో డ్రైవర్‌.. వెనుక నుంచి వస్తోన్న సైదులు రెడ్డి బైక్‌ను గమనించకుండా ఒక్కసారిగా డోర్ తెరిచాడు. దీంతో సైదులు రెడ్డి మహిళతో సహా డోర్‌కు గుద్దుకుని లారీ కిందపడిపోయాడు.

ఈ ఘటనలో సైదులు రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రగాయాల పాలైన నీలవేణిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటన అనంతరం ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.