లవ్ చీటింగ్ : ప్రియుడి చెంప చెల్లుమనిపించింది

  • Publish Date - April 24, 2019 / 07:56 AM IST

ఫేస్ బుక్ లో ప్రేమించాడు…సహజీవనం చేశాడు. మూడుముళ్లు వేస్తానంటూ ఓ యువతిని నమ్మించి నట్టేట ముంచాడు. కళ్లబొల్లి మాటలతో కహానీలు చెప్పి ఆమె దగ్గరున్న నాలుగు కాసులను కాజేశాడు. అసలు విషయంలోకి రావడంతో తనకు సంభందం లేదంటూ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఆనంద్ తన చదువు ముగిసిన అనంతరం ఉద్యోగ ఉపాధి కోసం గత 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన వారి సహాయంతో కొండాపూర్‌లోని ఓ అపార్ట్ మెంట్లో ఇల్లును అద్దెకు తీసుకున్నాడు.

నల్గొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఫేస్ బుక్‌లో పరిచయమైంది. ఈమెతో ప్రేమాయణం సాగించాడు. అలా కొంతకాలం వీరిద్దరూ చనువుగా మారారు. వీరిద్దరు ఒకే ఇంట్లో ఉండసాగారు. అలా వీరిద్దరి మధ్య అవధులు లేని సానిహిత్యం పెరగడంతో గత 3 సంవత్సరాలుగా బంధం సజావుగా సాగింది.
Also Read : బాబోయ్ దెయ్యం : శ్రీకాకుళంలో భయం భయం

యువతి గతంలో అమెరికాలో జాబ్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ తనకున్న అవగాహనతో స్థానికంగా డాగ్స్ బిజినెస్ చేస్తోంది. చట్టబద్దత లేని వీరి అనుబంధంలో ఏమి జరిగిందో ఏమో కానీ అరవింద్ తట్ట, బుట్ట సర్దుకొని తన సొంత ఊరైన టంగుటూరుకు చెక్కేశాడు. దీంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా అరవింద్ ఫోన్ పని చేయలేదు. అనుమానం వచ్చిన యువతి..అతని స్వగ్రామానికి చేరుకుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిని పట్టుబట్టింది. ప్రేమ పేరుతో తన వద్ద నున్న 70 లక్షలు కాజేశాడంటూ వాపోయింది.

మెసపోయిన తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు మొర పెట్టుకుంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ గత నాలుగు రోజులుగా ప్రియుడి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తోంది. దీంతో అరవింద్ ఇటుకల బట్టికి మకాం మార్చేశాడు. దీంతో ఆగ్రహించిన యువతి ఉగ్రరూపం దాల్చింది. తనను ఎందుకు మెసం చేశావు ? పెళ్లి ఎందుకు చేసుకోవు ? సమాదానం చెప్పాలంటూ చెంప చెల్లుమనిపించింది. 

ఇద్దరం బెస్టు ఫ్రెండ్‌గా ఉన్నామని..ఒకే అపార్ట్ మెంట్లో వేరే రూములలో ఉన్నామంటూ చెప్పుకొస్తున్నాడు. తనతో సహజీవనం చేయలేదని పెళ్లి అస్సలు చేసుకోలేదని చెబుతున్నాడు. తాను పెండ్లి చేసుకున్నట్లు గాని ఆమెతో సహజీవనం చేసినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని అంటున్నాడు.
Also Read : మాటల్లేవ్.. మైండ్ బ్లాంక్ : ఆయన పీల్చిన గాలి.. డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు