మంత్రిగారికి ’మాస్కులు మాల’తో స్వాగతం పలికిన కార్యకర్తలు: కరోనా ట్రెండ్

  • Publish Date - July 11, 2020 / 04:01 PM IST

కరోనా ట్రెండ్. అన్నీ మారిపోయాయి. కరోనా ట్రెండ్ ఫాలో అవ్వదు..ట్రెండ్ సెట్ చేస్తుంది అన్నట్లుగా మారిపోయింది ఈ మహమ్మారి కాలంలో. కరోనాకు వెనుక..కరోనాకు ముందు అన్నట్లుగా మారిపోయాయి రోజులు. గతంలో రాజకీయ నాయకులకు పూల మాలలు వేసి స్వాగతించేవారు.కానీ ఇది కారోనా కాలం కదా..కాస్త డిఫరెంట్ గా..ట్రెండ్ గా ఉండాలనుకున్నారో ఏమో గానీ..తమ ప్రాంతానికి వచ్చిన మంత్రికి స్థానికులు..కార్యకర్తలు ‘‘మాస్క్’’లతో తయారు చేసిన మాల వేసి స్వాగతం పలికిన ఆసక్తిక ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

రాష్ట్ర మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ తొలిసారిగా గ్వాలియర్ పర్యటనకు వచ్చారు.ఈ సందర్భంగా అక్కడి బీజేపీ కార్యకర్తలు మంత్రిగారికి మాస్క్ మాలతో స్వాగతం పలికారు. అలాగే మంత్రి అక్కడికి వచ్చిన ప్రజలకు మాస్క్‌లను, శానిటైజర్లను ప్రజలకు పంచారు. తరువాత దివంగత మాధవరావు సింధియా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మంత్రి వస్తున్నారని తెలిసి కొంతమంది తల్లిదండ్రులు… విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ఒత్తిడిపై ఆయనకి ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ఇటువంటి పరిస్థితిలో పిల్లల స్కూలు ఫీజుల కట్టలేమని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ విన్న మంత్రి దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.