ప్రాణాయామం..యోగా, సంగీతాలతో కరోనాను జయిస్తున్న పేషెంట్లు :బాధితులకు ధైర్యానిస్తున్న సోలాపూర్

  • Publish Date - July 28, 2020 / 01:47 PM IST

దేశంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఎప్పుడూ ముందంజలోనే ఉంది. దీని కట్టడికి మెడిసిన్ కోసం అనేక దేశాలతో పాటు భారత్ కూడా విశేషంగా కృషి చేయటం..వాటికోసం ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని విధాలుగా యత్నాలు చేస్తున్నా కంట్రోల్ కావటంలేదు. కానీ రాష్ట్రంలోని షోలాపూర్ లోని కరోనా సెంటర్ లో మాత్రం కరోనా సోకిన పేషెంట్లు డాక్టర్ల పర్యవేక్షణలో త్వరగా కోలుకుంటున్నారు. మెడిసిన అందుబాటులోకి రాలేదు. దీంతో కొత్త మార్గాలతో కరోనానుంచి కోలుకునేలా చేస్తున్నారుడాక్టర్లు. ఎలా అంటే..

షోలాపూర్‌లోని క్యాటరింగ్ కాలేజీలో జిల్లా మేజిస్ట్రేట్ మిలింద్ శంభార్కర్ చొరవతో మే 27న ఏర్పాటైన ఈ క్వారంటైన సెంటర్ లో కరోనా పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారు. జూలై 20 నుంచి ఈ సెంటర్ లో కరోనా పేషెంట్లకు డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రాణాయామం, యోగాస‌నాల‌ను నేర్పిస్తున్నారు. అంతేకాదు..మనస్సును అల‌రించే సంగీతాన్ని కూడా వినిపిస్తుండటంతో కరోనా బాధితులంతా ఒత్తిడిని జయిస్తున్నారు. కరోనా వచ్చినా భయంలేదు..మానసిక థైర్యంతో దాని జయిస్తామంటున్నారు.

ఈ కేంద్రంలో అన్ని రకాల సదుపాయాలతో 338 మంది రోగుల చికిత్స‌ పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 138 కరోనా రోగులు డిశ్చార్జ్ అయి వెళ్లిపోగా..ప్రస్తుతం 178 మంది కరోనా బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.