కలియుగ వైకుంఠధాముడు, తెలుగువారికి ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఏడాది పొడవునా మలయప్ప స్వామికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
తిరుమల: కలియుగ వైకుంఠధాముడు, తెలుగువారికి ఇష్టమైన దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఏడాది పొడవునా మలయప్ప స్వామికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్
శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణరధంపై తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులుస్వామివారిని తిలకిస్తూ గోవిందనామాలు స్మరిస్తూ పులకించి పోయారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వసంతోత్సవాల సందర్భంగా తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.
Also Read : మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స