Naaptol Online పేరిట మోసం : కారు చెప్పి రూ. 16 లక్షల టోకరా

  • Publish Date - August 26, 2019 / 05:15 AM IST

వావ్..మీరు లక్కీ డ్రాలో గెలిచారు..మీకు కారు వచ్చేసింది, లేదా డబ్బు అందచేస్తాం..అంటూ ఎవరైనా ఫోన్ చేస్తున్నారా..అయితే..అవన్నీ ఫేక్. నిజం అని నమ్మారో..అంతే సంగతులు. ఆన్ లైన్ పేరిట మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో నాప్ టాల్ ఆన్ లైన్ పేరిట ఒకరు బలయ్యారు. 

మీరు మహీంద్ర ఎక్స్ యూవీ 500 కారు గెలుచుకున్నారంటూ..ఈశ్వరమాదారం గ్రామానికి చెందిన చందా అంజయ్యకు గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారు. ఒక లెటర్, స్క్రాచ్ కార్డును ఇంటికి పంపించారు. ఇవి నాప్ టాల్ పేరిట ఉన్నవి. పలుమార్లు నాప్ టాల్ నుంచి వస్తువులు తెప్పించుకుంటండడంతో ఇది కూడా నిజమని నమ్మాడు అంజయ్య. అయితే..కారు దక్కించుకోవాలంటే..అకౌంట్లో డబ్బులు వేయాలని ఎవరో చెప్పారు.

వారు చెప్పినట్లుగా డబ్బులు వేస్తూ వచ్చాడు. నగదును అవజిత్ సర్కార్ అనే వ్యక్తి అకౌంట్లో జమ చేశాడు. నాలుగు అకౌంట్లలో విడతల వారీగా నగదు జమ చేశాడు. రూ. 16 లక్షల 34 వేలు అకౌంట్లో వేసినా.ఇంకా డబ్బులు వేయాలని చెబుతుండడంతో తాను మోసపోయానని చివరకు గ్రహించాడు అంజయ్య. బాధితుడు కూసుమంచి పోలీసులను ఆశ్రయించాడు. చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Read More : జాగ్రత్తలు తీసుకోండి : విజృంభిస్తున్న డెంగీ, మలేరియా

ట్రెండింగ్ వార్తలు