విజయసాయిరెడ్డి లెటర్ ఎఫెక్ట్ : సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్

  • Publish Date - January 17, 2020 / 04:21 PM IST

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా  ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్  నియమితులయ్యారు. ఆయన 1994  గుజరాత్ కేడర్ కు చెందిన అధికారి. ఈ పదవిలో ఆయన అయిదేళ్ళపాటు కొనసాగుతారు. కాగా సీబీఐ జేడీ గా  ఏపీకి చెందని వ్యక్తిని, రాజకీయాలకు చెందని వ్యక్తిని నియమించాలని  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

మరో వైపు  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సన్నిహితుడైన హెచ్.వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావటానికిచేస్తున్నప్రయత్నాలను కూడా విజయసాయి రెడ్డి తన లేఖలో ఉదహరించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకుని చక్రం తిప్పాలని చూస్తున్నారని కూడా విజయసాయిరెడ్డి ఆరోపించారు.  విజయసాయి రెడ్డి లేఖకు అమిత్ షా వెంటనే స్పందించి ఆలేఖను సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సీబీఐ జేడీ నియామకం జరిగింది.