మారుతీరావు అంత పిరికివాడు కాదు: లాయర్

  • Publish Date - March 9, 2020 / 03:22 PM IST

ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు తరపున వాదించిన వ్యక్తిగత లాయర్‌ వెంకట సుబ్బారెడ్డి. 

తనను కలిసేందుకే మారుతిరావు హైదరాబాద్‌కు వచ్చారని చెప్పిన లాయర్.. రాత్రి 8.30 గంటల సమయంలో మారుతిరావు తనతో మాట్లాడారని, కేసుపై చర్చించారని వెల్లడించారు. 

ప్రణయ్ హత్య కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందుకు రావడం మారుతిరావును కలిచివేసిందని, ఈ కేసులో శిక్ష పడుతుందని మారుతీరావుకు తెలుసునని.. ఆ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

 ఆస్తి పంపకాల విషయాలను మాత్రం ఎప్పుడు తనతో చర్చించలేదని అన్నారు. మారుతిరావుతో తనకు ఏడేళ్ల పరిచయం ఉందని చెప్పుకొచ్చారు.