ఓ సామాజిక వర్గంపై వివాదాస్పద పోస్ట్ పెట్టిన కర్ణాటక ఎమ్మెల్యే ఆర్.అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ తల తెచ్చి ఇస్తే రూ. 51 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద ట్వీట్ చేసిసారు మీరట్‌కు చెందిన షహజీబ్ రిజ్వీ. దీంతో అతన్ని మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.మీరట్‌లోని ఫలవాడాకు చెందిన రిజ్వీ గతంలో సమాజ్‌వాదీ పార్టీలో పనిచేశాడు. పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రిజ్వీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు మీరట్ ఎస్పీ (రూరల్) అవినాశ్ పాండే తెలిపారు.
బెంగళూరులోని డీజే హళ్లి-కేజీ హళ్లి అల్లర్లకు కారణమైన పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ తల తెస్తే రూ.51 లక్షలు నజరానాగా ఇస్తానంటూ ట్విట్టర్‌లో రిజ్వీ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగుళూరులో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురుమరణించారు. దాదాపు 140 మందిని అరెస్ట్ చేశారు.
కాగా..రిజ్వీ పోస్టుపై నవీన్ తండ్రి పవన్ కుమార్ స్పందిస్తూ..సోషల్ మీడియాల్లో ఇటువంటి పోస్ట్ లు పెట్టటం సహజమని కొట్టిపడేశారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు ఉన్నారని, కోర్టులు శిక్షిస్తాయని పేర్కొన్నారు.