కలానికి కాదు.. కులానికి సంకెళ్లు : మంత్రి కోడాలి వార్నింగ్

  • Publish Date - November 1, 2019 / 10:49 AM IST

కలానికి సంకెళ్లు కాదు.. కులాధిపతులకే అన్నారు ఏపీ మంత్రి కోడాలి నాని. కలానికి కాదని.. కులానికి సంకెళ్లు పడ్డాయంటూ విమర్శలు చేశారాయన. కులాధిపతులు వీళ్లు.. ఎల్లకాలం రాష్ట్రాన్ని పరిపాలించాలి.. వీళ్లకే దేశంలో, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు దైవదృష్టితో తెలిసిపోతాయా అంటూ వెటకారాలు ఆడారు. కట్టుకథలు అల్లి రాస్తాం.. మీరు ఏమి అనకూడదు.. ఏది చెబితే అదే వాస్తవం అంటూ పిచ్చి కథలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొడాలి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై కొన్ని రోజులుగా విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి కొడాలి. 2019, నవంబర్ ఒకటో తేదీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను దుర్వినియోగం చేసుకుంటూ.. నిజాయితీపరులైన వారిని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. కలానికి సంకెళ్లు కాదు.. తప్పుడు వార్తలు రాసేవాళ్లకు.. కులానికి సంకెళ్లు పడ్డాయన్నారు. జర్నలిస్టులు, నీతి నిజాయితీగా పని చేసే మీడియా సంస్థలు ఎప్పటిలాగానే స్వేచ్చను కొనసాగించవచ్చని సూచించారు. మీడియా సోదరులు, ఇతర యాజమాన్యాలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు మంత్రి కోడాలి నాని.

నిరాధారమైన వార్తలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019, అక్టోబర్ 16వ తేదీన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరాధారమైన వార్తలపై సీరియస్‌గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అవాస్తమైన వార్తలు రాసినా.. ప్రచురించినా.. ప్రసారం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు జీవో తీసుకొచ్చింది. ఈ వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా విభాగాల (ప్రభుత్వ శాఖల) కార్యదర్శులకు అప్పగించారు. జీవో విడుదల చేసింది ప్రభుత్వం.
Read More : తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తప్పవు – ఏపీ మంత్రి పేర్ని నాని