మార్షల్స్ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారని మంత్రి పేర్ని నాని అన్నారు. నిన్న టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని చెప్పారు.
మార్షల్స్ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారని మంత్రి పేర్ని నాని అన్నారు. నిన్న టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని చెప్పారు. టీడీపీ సభ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం (డిసెంబర్ 13, 2019) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మార్షల్స్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
చంద్రబాబు మెప్పు కోసం టీడీపీ నేతలు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. గౌరవ సభ్యులు హుందాగా వ్యవహిరించాలని కోరారు. సభ్యుల భద్రత, అసెంబ్లీ గౌరవం పట్ల నిద్రాహారాలు, తిండి తిప్పలు మాని, కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితిలో ఉద్యోగాలు చేస్తున్నమార్షల్స్ పై దాడి చేస్తే చర్యలు తీసుకోకుండా ఉండటం ధర్మం కాదన్నారు. దాడికి పాల్పడిన సభ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.